అధికారం కోసమే బీజేపీ రాముడి మంత్రం.. ఆయన వారికొక్కరికే దేవుడు కాదు: ఫరూక్ అబ్దుల్లా

  • విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడేనన్న ఫరూక్ అబ్దుల్లా
  • బీజేపీ తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలన్నఎన్‌సీ అధినేత
  • భక్తులమని చెప్పుకునే వారికి ప్రేమ ఉండదని విమర్శ
Lord Sri Rama Not Only Hidu God says Farooq Abdullah

శ్రీరాముడిని బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటోందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. శ్రీరాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదన్నారు. పాంథర్స్ పార్టీ నిన్న ఉధంపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

శ్రీరాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని, ఆయనను విశ్వసించే వారందరికీ దేవుడేనని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రం ఆయనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందన్నారు. బీజేపీ తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, అమెరికన్లు, రష్యన్లు.. ఇలా ఎవరైతే విశ్వసిస్తారో, వారందరికీ ఆయన దేవుడేనని చెప్పారు. తామే రామభక్తులమని చెప్పుకునే వారికి నిజంగా రాముడిపై ఎలాంటి ప్రేమ ఉండదని, అధికారం కోసమే వారలా చెబుతారని విమర్శించారు.

More Telugu News