వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్.. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు

  • అనురాధకు ఓటేసిన 23 మంది ఎమ్మెల్యేలు
  • వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్
  • అనురాధ విజయంతో టీడీపీలో ఉత్సాహం
TDP candidate Panchumarthi Anuradha wins as MLC

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా  కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడింది. 

వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 

More Telugu News