data theft: 16.80 కోట్ల మంది డేటా చోరీ.. దేశంలోనే అతి పెద్ద స్కామ్!

six members arrested in data theft of 16 crore people across the country
  • ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
  • బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ హస్తం ఉన్నట్లు గుర్తింపు
  • కేసులో కీలకంగా మారిన జస్ట్ డయల్ సంస్థ
  • మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు పోలీసుల అనుమానం
  • దర్యాప్తునకు ఐపీఎస్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమాస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ స్కామ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. కేసులో కీలకమైన జస్ట్ డయల్ సంస్థపైనా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. 

‘‘నాగపూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు.. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించాం. బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాలని ప్రజలకు ఫోన్లు, మెసేజ్ లను నిందితులు చేస్తుంటారు’’ అని వివరించారు. 

వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు గుర్తించారు. ఇలా మొత్తంగా దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లకు నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా చోరీకి గురైనట్లు గుర్తించారు.
data theft
six members arrested
cyberabad police
16 crore peoples data theft

More Telugu News