మృగాల్లాంటి మనుషులను భయపెట్టే మొనగాడు: ఎన్టీఆర్ 30వ సినిమా గురించి కొరటాల

  • రాజమౌళి క్లాప్ తో మొదలైన కొరటాల సినిమా 
  • కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా 
  • కథానాయికగా జాన్వీ కపూర్ పరిచయం 
  • మృగాల్లాంటి మనుషుల మధ్య నడిచే కథ అన్న కొరటాల 
  • బలమైన టీమ్ తో ముందుకు వెళుతున్నట్టుగా వెల్లడి 
Ntr and koratala movie update

ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా, ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాజమౌళి క్లాప్ తో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి కొరటాల మాట్లాడారు. 

"ఎన్టీఆర్ తో ఇంతకుముందు 'జనతా గ్యారేజ్' చేశాను. ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్ మళ్లీ దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియాకి దూరంగా ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అక్కడి మనుషుల్లో మృగాల్లాంటివారు ఎక్కువగా కనిపిస్తారు. వారికి దేవుడన్నా .. చావు అన్నా భయం ఉండదు. కానీ ఒకే ఒక్కటంటే భయం వాళ్లకి .. అదేమిటనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది" అన్నారు. 

"భయం ఉండాలి .. భయపెట్టాలి అన్నట్టుగా ఈ సినిమాలోని ప్రధానమైన పాత్ర ముందుకు వెళుతూ ఉంటుంది. తప్పకుండా ఇది నా కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుంది. ఫైర్ తో నేను రాసిన ఈ కథకు న్యాయం చేస్తానని అనిరుధ్ ఉత్సాహంతో అన్నాడు. శ్రీకర్ ప్రసాద్ గారు .. రత్నవేలు గారు .. నా ఊహకు రూపాన్ని ఇచ్చే సాబు సిరిల్ గారు .. వీఎఫెక్స్ కి సంబంధించి నా మిత్రుడు యుగంధర్ గారు ఈ ఐడియాను ముందుకు తీసుకుని వెళ్లడానికి నాతో ట్రావెల్ అవుతున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News