Narendra Modi: సీబీఐ అంటే మోదీకే నమ్మకం లేదు.. 10 ఏళ్ల కిందటి ట్వీట్ తో కేటీఆర్ విమర్శ!

Minister KTR satires on Prime Minister Narendra Modi
  • బీజేపీ టార్గెట్ గా విమర్శలు కొనసాగిస్తున్న కేటీఆర్
  • కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సీబీఐ మారిపోయిందన్న మోదీ ట్వీట్ కు కామెంట్
  • సీబీఐని ప్రధానే నమ్మరని, అందుకే దేశ ప్రజలు కూడా నమ్మరని వ్యాఖ్య
బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర రాజకీయ విమర్శలు ఇటీవల పెరిగిపోయాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పిలవడంతో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో హోర్డింగ్స్, పోస్టర్లు కనిపించగా.. ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తూ, విమర్శలు కురిపిస్తున్నారు.

తాజాగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని కేటీఆర్ విమర్శలు చేశారు. 10 ఏళ్ల కిందట.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సీబీఐ మారిపోయింది. ఆ సంస్థపై దేశం విశ్వాసం కోల్పోయింది. సీబీఐతో భయపెట్టాలని చూడొద్దని కేంద్రానికి స్పష్టం చేస్తున్నా’’ అని ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు. 

దీనిపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘‘సీబీఐ లాంటి కేంద్ర సంస్థలపై దేశానికి ఎందుకు నమ్మకం లేదు?.. ఎందుకంటే గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారే సీబీఐని నమ్మరు కాబట్టి!!’’ అని ఎద్దేవా చేశారు.
Narendra Modi
KTR
KTR satires on Modi
BRS
BJP
CBI

More Telugu News