Prabha: ఎన్టీ రామారావుగారిని చూడగానే నోట మాట రాలేదు: సీనియర్ నటి ప్రభ

  • 70వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటి ప్రభ 
  • 'నీడలేనిది ఆడది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ 
  • ఎన్టీఆర్ తో చేసిన మొదటి సినిమా 'దాన వీర శూర కర్ణ'
  • ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్న ప్రభ
Prabha Interview

తెలుగు తెరపై తమదైన ముద్రవేసిన అలనాటి కథానాయికలలో ప్రభ ఒకరు. 1970లలో తెనాలి నుంచి వెళ్లి తెలుగు సినిమాను ఏలినవారిలో ఆమె ఒకరు. ఎన్టీఆర్ శతజయంతి అవార్డును మొదటిసారిగా అందుకున్నది ఆమెనే. తాజా ఇంటర్వ్యూలో ప్రభ మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"చదువుకునే రోజుల నుంచి నాకు ఎన్టీఆర్ గారి పౌరాణికాలు .. ఏఎన్నార్ గారి సాంఘికాలు అంటే చాలా ఇష్టం. అలాంటి నేను 'నీడలేని ఆడది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ఇక ఎన్టీఆర్ తో నేను చేసిన ఫస్టు మూవీ 'దాన వీర శూర కర్ణ'. అప్పటివరకూ ఆయనను నేను కలవలేదు. రామకృష్ణ సినీ స్టూడియోస్ ఓపెనింగ్ హీరోయిన్ నేనే. సెట్లో ఆయనను చూడగానే నాకు నోట మాట రాలేదు" అని అన్నారు. 

" ఈ సినిమా షూటింగ్ 'చిత్రం భళారే విచిత్రం' సాంగ్ తో మొదలైంది. కెమెరా ముందుకు వెళ్లగానే ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం చూసి భయం వేసింది. మా గురువు గారు నాకు ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ గారితో హీరోయిన్ గా 100 సినిమాలు చేస్తే ఎంత పాప్యులారిటీ వస్తుందో, ఆ ఒక్క పాటతో నాకు అంత పాప్యులారిటీ వచ్చింది. దుర్యోధనుడు అనే ఒక నెగెటివ్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా మార్చిన గొప్పతనం ఎన్టీఆర్ గారి సొంతం" అని చెప్పుకొచ్చారు.

More Telugu News