సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైన ఎన్టీఆర్ 30వ సినిమా!

  • పట్టాలపైకి ఎన్టీఆర్ 30వ సినిమా
  • దర్శకత్వం వహిస్తున్న కొరటాల 
  • గ్రాండ్ గా పూజా కార్యక్రమం 
  • హాజరైన జాన్వీ కపూర్ 
  • అతిథులుగా విచ్చేసిన రాజమౌళి, ప్రశాంత్ నీల్  
Ntr and koratala movie launch

కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా చాలా రోజులుగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ ఆనందాన్ని కలిగిస్తూ, ఈ రోజు ఉదయం హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలరించనుంది. ఆమె కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరైంది. తెలుగులో ఆమె చేస్తున్న ఫస్టు సినిమా ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ తో 'ఆర్ ఆర్ ఆర్' తీసిన రాజమౌళి .. ఎన్టీఆర్ 31వ సినిమాకి దర్శకత్వం వహించనున్న ప్రశాంత్ నీల్ కూడా హాజరు కావడం మరో విశేషం. యువ సుధా ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరించనున్నాడు. ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఈ పూజా కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ .. దిల్ రాజు .. శ్రీకాంత్ .. సితార నాగవంశీ తదితరులు హాజరయ్యారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది.

More Telugu News