Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 446 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి  58,075కి పెరిగింది. నిఫ్టీ 119 పాయింట్లు పుంజుకుని 17,108కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.11%), బజాజ్ ఫైనాన్స్ (2.94%), టైటాన్ (2.15%), యాక్సిస్ బ్యాంక్ (2.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.94%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.00%), హిందుస్థాన్ (-1.88%), టెక్ మహీంద్రా (-1.19%), టీసీఎస్ (-1.12%), ఇన్ఫోసిస్ (-0.91%).

More Telugu News