Bandi Sanjay: ఆ పని చేసి ఉంటే పంట నష్టపోయిన రైతులకు మేలు జరిగి ఉండేది: బండి సంజయ్

  • అకాల వర్షాలతో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న బండి సంజయ్
  • ఇప్పటి వరకు సమగ్ర పంట బీమా పథకాన్ని రూపొందించకపోవడం బాధాకరమని వ్యాఖ్య
  • నివేదికల రూపంలో కాలయాపన చేయొద్దని విన్నపం
Bandi Sanjay demands to pay compensation for farmers who lost due to rains

తెలంగాణలో వడగండ్లతో కూడిన అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... అకాల వర్షాలతో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహాన్ని అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడానికి రాష్ట్రంలో ఇప్పటి వరకు సమగ్ర పంట బీమా పథకాన్ని రూపొందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి ఉంటే పంట నష్టపోయిన రైతులకు మేలు జరిగేదని అన్నారు. నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా రైతులకు వెంటనే పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం... ఆ హామీని అమలు చేయాలని అన్నారు. 

More Telugu News