Amritpal: చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలిస్థానీ లీడర్

Khalistani Leader Amritpal Singh Declared Fugitive
  • పరారీలో అమృత్ పాల్ సింగ్.. పంజాబ్ లో హై అలర్ట్
  • శనివారం వంద వాహనాలతో వెంటాడిన పోలీసులు
  • వారిస్ పంజాబ్ దే చీఫ్ అనుచరులు 78 మంది అరెస్టు
ఖలిస్థానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడని పంజాబ్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. అమృత్ పాల్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు చెప్పారు. శనివారం చిక్కినట్టే చిక్కి చివరి క్షణంలో తప్పించుకు పారిపోయాడని వెల్లడించారు. జలంధర్ లో శనివారం సాయంత్రం అమృత్ పాల్ ఓ ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్లడం చూశామని స్థానికులు చెబుతున్నారు. అయితే, పోలీసులు దీనిని నిర్ధారించలేదు.

అమృత్ పాల్ సింగ్ గన్ మెన్లు ఆరుగురితో పాటు వారిస్ పంజాబ్ దే సంస్థకు చెందిన 78 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ ఛాహల్ మీడియాకు వెల్లడించారు. ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే దల్జీత్ సింగ్ ఖల్సిని గుర్గావ్ లో అరెస్టు చేశామని చెప్పారు. ఏడు జిల్లాల పోలీసులతో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసి అమృత్ పాల్ ను అరెస్టు చేయడానికి శనివారం భారీ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. 

వంద వాహనాలతో వెంబడించినట్లు చెప్పారు. చివరి క్షణంలో అమృత్ పాల్ మోటార్ సైకిల్ పై పారిపోయాడని వివరించారు. అమృత్ పాల్ ను పట్టుకోవడానికి వేట మొదలెట్టామని, అమృత్ సొంతూరు జల్లూపూర్ ఖైరాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సీపీ కుల్దీప్ సింగ్ వివరించారు.
Amritpal
Punjab
waris punjab de
fugitive
jalandhar
Khalistan

More Telugu News