Jr NTR: ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ముహూర్తం ఖరారు

Jr NTR Janhvi Kapoors NTR 30 to be launched on THIS date with muhurtam puja Details inside
  • ఈ నెల 23న మొదలు కానున్న చిత్రీకరణ 
  • ట్విట్టర్ లో ప్రకటించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
  • ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి అరంగేట్రం
ఎంతో ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్న ‘ఎన్టీఆర్ 30‘ షూటింగ్ ముహూర్తం ఖరారైంది. ఈ నె 23న సినిమా చిత్రీకరణ మొదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జూనియన్ ఎన్టీఆర్, దిగ్గజ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనున్నారు. జాన్వీ కపూర్ కు ఇది తొలి సినిమా. దీంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే.. జాన్వీ కపూర్ కు తెలుగు పరిశ్రమలో మంచి భవిష్యత్తుకు అవకాశాలు ఉంటాయన్నది విశ్లేషకుల అంచనా. 

ఎన్టీఆర్ 30 సినిమా చిత్రీకరణ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. బ్యానర్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. 23న ముహూర్తం పూజతో సినిమా మొదలవుందని ప్రకటించింది. తారక్, జాన్వీ కపూర్, కొరటాల శివ, నంద మరళి కల్యాణ్, అనిరుధ్ అఫీషియల్, రత్నవేలడాప్, శ్రీకర్ ప్రసాద్, సాబుసైరిల్, యువ సుధా ఆర్ట్స్ కు ట్యాగ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చివరిగా నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందడంతోపాటు, ప్రతిష్టాత్మక అవార్డులను సైతం గెలుచుకుంటున్న విషయం తెలిసిందే.
Jr NTR
Janhvi Kapoor
NTR 30
shooting
muhurtam
lauching

More Telugu News