భారీ టార్గెట్ నిర్దేశించిన జెయింట్స్... ఆర్సీబీ అమ్మాయిలకు అగ్నిపరీక్ష
- డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జెయింట్స్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు
- రాణించిన వోల్వార్ట్, గార్డనర్, మేఘన
ఓపెనర్ లారా వోల్వార్ట్ మరోసారి అర్ధసెంచరీతో అలరించగా, ఆష్లే గార్డనర్ 41 పరుగులతోనూ, సబ్బినేని మేఘన 31 పరుగులతోనూ ఆకట్టుకున్నారు. వోల్వార్ట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేసింది. ఆఖర్లో హేమలతా (16 నాటౌట్), హర్లీన్ డియోల్ (12) కూడా ధాటిగా ఆడారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్ సోఫీ డివైన్ 27, కెప్టెన్ స్మృతి మంధన 22 పరుగులతో ఆడుతున్నారు.