వెలుగులో ఉండాలంటే చీకటి సాయం తీసుకోవాలి: 'బ్లాక్ అండ్ వైట్' ట్రైలర్ డైలాగ్!

  • హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రగా 'బ్లాక్ అండ్ వైట్'
  • ప్రేమ - ప్రతీకారం నేపథ్యంలో నడిచే కథ 
  • వరుస హత్యలతో సాగిన ట్రైలర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు     
Black  and White trailer released

హెబ్బా పటేల్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే, సక్సెస్ ను చూసింది. ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఒకానొక దశలో ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత కథానాయికగా వెనుకబడిన ఆమె, ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఈ మధ్య కాలంలో తెరపై ఆమె కనిపించలేదు.

మళ్లీ ఇప్పుడు 'బ్లాక్ అండ్ వైట్' సినిమాతో ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హెబ్బా పటేల్ ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. 

'వెలుగులో ఉండాలంటే అప్పుడప్పుడు చీకటి సాయం తీసుకోవాలి' అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్ హైలైట్ గా అనిపిస్తోంది. ఒక వైపున శృంగారం .. మరో వైపున మర్డర్లతో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను వదిలారు. సూర్య ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News