Jagan: రేపు తిరువూరులో పర్యటించనున్న జగన్

Jagan visiting Thiruvuru tomorrow
  • జగనన్న విద్యా పథకం నాలుగో విడత కార్యక్రమం
  • విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్న సీఎం
  • 11 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రేపు ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. తిరువూరు సభలో జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత కింద రూ. 700 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయనున్నారు. మొత్తం 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. 

జగన్ పర్యటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారని కొనియాడారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దారని చెప్పారు. ప్రభుత్వ విద్యను చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు. చదువు ద్వారానే అన్నీ సాధ్యమనే విషయాన్ని నమ్మిన వ్యక్తి జగన్ అని చెప్పారు. అందుకే విద్యకు జగన్ పెద్ద పీట వేశారని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జగన్ మాదిరి ఏ ముఖ్యమంత్రి కూడా విద్యకు ప్రాధాన్యతను ఇవ్వలేదని అన్నారు.

  • Loading...

More Telugu News