VTPS: విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో లిఫ్ట్‌ ప్రమాదం... ఇద్దరి మృతి

  • వైరు తెగిపోవడంతో కూలిపోయిన లిఫ్ట్
  • ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో 8 మంది
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Lift collapsed in VTPS as two dies

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో లిఫ్ట్ ప్రమాదం సంభవించింది. వైరు తెగిపోవడంతో లిఫ్ట్ కిందకుపడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో మొత్తం 8 మంది ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని లిఫ్ట్ నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ లిఫ్ట్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

More Telugu News