Rajinikanth: భార్యతో కలిసి టీమిండియా-ఆసీస్ వన్డే మ్యాచ్ కు విచ్చేసిన రజనీకాంత్

Rajinikanth attends 1st ODI between Team India and Australia in Mumbai
  • ముంబయిలో భారత్, ఆసీస్ తొలి వన్డే
  • వాంఖెడే మైదానంలో మ్యాచ్
  • భార్య లతతో కలిసి వీఐపీ గ్యాలరీలో దర్శనమిచ్చిన తలైవా
ముంబయిలోని వాంఖెడే మైదానంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కు ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అర్ధాంగి లతతో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తూ టీవీ కెమెరాల కంటబడ్డారు. వీఐపీ గ్యాలరీలో కూర్చున్న రజనీకాంత్ దంపతులు ఆసక్తిగా మ్యాచ్ ను వీక్షిస్తూ కనిపించారు. అంతకుముందు, రజనీకాంత్ దంపతులకు ముంబయి క్రికెట్ వర్గాలు స్టేడియంలో సాదర స్వాగతం పలికాయి.
Rajinikanth
Latha
1st ODI
Team India
Australia
Wankhede Stadium
Mumbai

More Telugu News