tspsc: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ

  • ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటన 
  • జూన్ 11న మరోసారి గ్రూప్ ప్రిలిమ్స్ నిర్వహిస్తామని వెల్లడి
  • ఏఈఈ, డీఏవో పరీక్షలు ఎప్పుడనే దానిపై త్వరలో నిర్ణయం
  • జూనియర్ లెక్చరర్స్ పరీక్ష వాయిదా
group 1 prelims cancelled by tspsc

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 11న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు ఈరోజు వెల్లడించింది.

ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఈ రెండు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పేపర్ లీకేజీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. 

మరోవైపు జూనియర్ లెక్చరర్స్ పరీక్షను టీఎస్ పీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ పరీక్షలు వాయిదా వేయగా.. ఇప్పుడు ఈ పరీక్షను నిలిపేసింది. పేపర్ల లీక్ ఘటనలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో 5 పేపర్లు ఉన్నట్లు తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిందితుడు ప్రవీణ్ ఫిబ్రవరి 27న పేపర్లను కాపీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

More Telugu News