Hail Storm: తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వానలు

  • ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో వర్షాలు
  • ఝార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి
  • ఒడిశా వైపు కదిలిన ద్రోణి
  • ఈ నెల 18న భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం
Hail storm in some places of Telangana

ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలం బడంపేట్, మనియార్ పల్లిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. 

కాగా, ఈ నెల 18న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఝార్ఖండ్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఒడిశా వైపు కదిలినట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.

More Telugu News