AR Rehman: ఇండియాకు ఆస్కార్ అవార్డులు రాకపోవడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్

  • మన దేశం నుంచి రాంగ్ సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారన్న రెహమాన్
  • అందుకే మనకు ఆస్కార్ అవార్డులు రావడం లేదని విమర్శ
  • ఆర్ఆర్ఆర్ ను అఫిషియల్ ఎంట్రీగా పంపించి ఉంటే మరో ఆస్కార్ వచ్చేదని వ్యాఖ్య
Wrong films are sending to Oscars from India says AR Rehman

మన దేశం నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ, ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు ఇంత వరకు మనకు రాలేదు. సంగీత విభాగం, డాక్యుమెంటరీ, కాస్ట్యూమ్స్ విభాగాల్లో మాత్రమే మన వాళ్లు ఆస్కార్ అందుకున్నారు. మనకు అవార్డు ఎందుకు రాలేదనే విషయంపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్పందించారు. మన దేశం నుంచి రాంగ్ సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారని... అందుకే మనకు ఆస్కార్స్ రావడం లేదని చెప్పారు. 

మనం పాశ్చాత్య సంగీతాన్ని వింటున్నప్పుడు... వారు మన సంగీతాన్ని ఎందుకు వినడం లేదని రెహమాన్ ప్రశ్నించారు. 'ఆర్ఆర్ఆర్'ను మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ కు పంపించి ఉంటే... బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో మనకు మరో ఆస్కార్ వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News