YS Avinash Reddy: రావాల్సిందే అన్న సీబీఐ ఆదేశాలతో విచారణకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి

  • వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
  • విచారణకు హాజరుకావడం ఇది నాలుగో సారి
  • ఇద్దరు లాయర్లతో సీబీఐ కార్యాలయానికి రాక
YS Avinash Reddy attends CBI questioning for 4th time

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు జరగనున్న విచారణకు హాజరు కాలేనని నిన్న సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా తనకు మినహాయింపును ఇవ్వాలని కోరారు. అయితే ఆయన విన్నపాన్ని సీబీఐ తిరస్కరించింది. విచారణకు కచ్చితంగా రావాలని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరు లాయర్లతో కలిసి హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో అవినాశ్ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు అవినాశ్ హాజరు కావడం ఇది నాలుగోసారి. ఈరోజు కూడా అవినాశ్ ను సుదీర్ఘంగా విచారణ జరిపే అవకాశం ఉంది. మరోవైపు, అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, ఆయనను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఆయన స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసి పంపిచేస్తారు.

More Telugu News