punjab minister to marry ips officer: పోలీస్ అధికారిని పెళ్లాడనున్న పంజాబ్ మంత్రి!

aap punjab minister harjot singh bains to marry ips officer jyoti yadav
  • త్వరలో మంత్రి హరజోత్ సింగ్, ఐపీఎస్ జ్యోతి యాదవ్‌ వివాహం
  • ఇప్పటికే నిశ్చితార్థం అయినట్లు ఆప్ వర్గాల వెల్లడి
  • శుభాకాంక్షలు చెప్పిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్
పంజాబ్ మంత్రి, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆప్ ఎమ్మెల్యే హరజోత్ సింగ్ బెయిన్స్, ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌ వివాహం చేసుకోనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల వీరికి నిశ్చితార్థం జరిగినట్టు తెలిపాయి. 

గతేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూప్నాపూర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా హరజోత్ గెలుపొందారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాన్ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్.. ప్రస్తుతం మన్సా జిల్లా ఎస్పీగా ఉన్నారు. హరియాణాలో గురుగ్రామ్‌ ఈమె స్వస్థలం. 

వీరిద్దరికీ పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మీ జీవితాలు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాయంటూ అభినందనలు తెలిపారు. మరోవైపు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే.. గుర్ ప్రీత్ కౌర్ ను సీఎం మాన్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు నరీందర్ కౌర్ భారజ్, నరీందర్ పాల్ సింగ్ సవానా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకున్నారు.
punjab minister to marry ips officer
aap minister harjot singh
ips officer jyoti yadav
AAP
Punjab

More Telugu News