Parliament: రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

  • జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు
  • మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు
  • ఫైనాన్స్ బిల్లు ఆమోదం, విపక్షాల డిమాండ్లపై చర్చకు అవకాశం
Second phase Parliament Budgets sessions will commence from tomorrow

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు. 

ఫైనాన్స్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం... అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని తూర్పారబట్టాలని విపక్షాలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో పోరాడనుంది. 

రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. ఫైనాన్స్ బిల్లును ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశం అని, ఆ తర్వాతే ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News