UP Warriorz: ఆసీస్ అమ్మాయిల ఫిఫ్టీలతో యూపీ వారియర్స్ గౌరవప్రద స్కోరు

UP Warriors scores reasonable runs against Mumbai Indians

  • డబ్ల్యూపీఎల్ లో ముంబయి వర్సెస్ యూపీ వారియర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వారియర్స్
  • కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబయి ఇండియన్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 రన్స్ చేసిన యూపీ
  • రాణించిన అలిస్సా హీలీ, తహ్లియా మెక్ గ్రాత్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. నేడు యూపీ వారియర్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ముంబయి ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ భారీ స్కోరు సాధించలేకపోయింది. 

ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ, తహ్లియా మెక్ గ్రాత్ ఆదుకోవడంతో యూపీ వారియర్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. హీలీ 58, మెక్ గ్రాత్ 50 పరుగులు చేయగా.... యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. 

ముంబయి ఇండియన్స్ బౌలింగ్ లో సాయికా ఇషాక్ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ 1 వికెట్ తీశారు.

UP Warriorz
Mumbai Indians
WPL
  • Loading...

More Telugu News