రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. మళ్లీ మొదలైన ఆందోళన!
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా ఉపరకం హెచ్3ఎన్2 కేసులు
- అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- మెడికల్ ఆక్సిజన్, టీకాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన
గత కొన్ని నెలలుగా దేశంలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని, కానీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త కేసులు, కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ ప్రవర్తనకు కట్టుబడి ఉండడమనే ఐదు పాయింట్ల వ్యూహానికి కట్టుబడి అప్రమత్తంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు.