Bandi Sanjay: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం

Women commission serious on Bandi Sanjay
  • కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
  • సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్
  • బండి సంజయ్ కు నోటీసుల జారీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. సంజయ్ ను ఈ విషయంలో విచారించాలని రాష్ట్ర డీజీపీని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ బండి సంజయ్ కు నోలీసులు జారీ చేశారు. అంతేకాదు ఇదే అంశంపై జాతీయ మహిళా కమిషన్ కు రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ రాయనుంది. మరోవైపు బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఆయనపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Bandi Sanjay
BJP
K Kavitha
BRS
Women Commission

More Telugu News