Avinash Reddy: అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం

Telangana high court orders CBI do not arrest Avinash Reddy till Monday
  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • ఇప్పటికే అవినాశ్ రెడ్డిని రెండుసార్లు విచారించిన వైనం
  • నేడు మూడోసారి విచారణ
  • తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాశ్ పిటిషన్
  • నేడు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
వివేకా హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అవినాశ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. 

అవినాశ్ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు. అందుకు కోర్టు స్పందిస్తూ... వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. కాగా, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను సీబీఐ విచారించడం ఇది మూడోసారి.
Avinash Reddy
CBI
Telangana High Court
YS Vivekananda Reddy
YSRCP

More Telugu News