Naresh: పవిత్ర లోకేశ్ ను పెళ్లి చేసుకున్న నరేశ్

Naresh ties knot with Pavitra Lokesh
  • కొంతకాలంగా ప్రేమలో ఉన్న పవిత్ర, నరేశ్
  • కొద్ది మంది సమక్షంలో పెళ్లి వేడుక
  • వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్.. నటి పవిత్ర లోకేశ్ ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాము కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు గతేడాది డిసెంబర్ 31న నరేశ్ ప్రకటించారు. పవిత్రను ముద్దు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నరేశ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. తమకు పెళ్లి అయిన విషయాన్ని వెల్లడించారు. ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముళ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని ట్వీట్ చేశారు.
Naresh
Pavitra Lokesh
marriage

More Telugu News