Mumbai: ముంబై వీధుల్లో యథేచ్ఛగా చిరుత సంచారం.. వీడియో ఇదిగో!

Leopard Roaming near residential society in Bhawani Nagar at Andheri East
  • అంధేరీ ఈస్ట్‌లోని భవానీ నగర్‌లో చిరుత చక్కర్లు
  • జాడను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాల ఏర్పాటు
  • ముంబైలో తరచూ కనిపిస్తున్న చిరుతలు
  • ఇటీవల షూటింగ్ సెట్‌లో నటుడు అక్షయ్ కుమార్ మేకప్‌మేన్‌పై దాడి
ముంబై వీధుల్లో ఓ చిరుత చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అంధేరి ఈస్ట్ మరోల్‌లోని భవానీ నగర్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్ వద్ద ఈ నెల 7న చిరుత కనిపించింది. వీధిలో అది దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, సమీపంలో నివసించే వారు మాత్రం దాని జాడను గుర్తించలేకపోయారు. చిరుత ఎవరిపైనా దాడిచేసిన దాఖలాలు కూడా లేవు. 

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో పరిశీలించారు. చిరుత జాడను గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలు అమర్చారు. స్థానికులకు అది ఎలాంటి అపాయం కలిగించకున్నా ఓ వీధికుక్కపై దాడిచేసినట్టు తెలుస్తోంది. కాగా, ముంబైలో చిరుతలు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో థానే, కల్యాణ్, గోరేగావ్, అంధేరీలలో చిరుతలు కనిపించాయి. ముంబై ఫిలిం సిటీలో ‘బడే మియా చోటే మియా’ షూటింగ్ జరుగుతుండగా నటుడు అక్షయ్ కుమార్ మేకప్ ఆర్టిస్ట్‌పై చిరుత ఒకటి దాడిచేసింది.
Mumbai
Andheri East
Leopard
Viral Videos

More Telugu News