Stock Market: యూఎస్ ఫెడ్ రిజర్వ్ చీఫ్ వ్యాఖ్యల ఫలితం.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ రిజర్వ్ చీఫ్ వ్యాఖ్యలు
  • 541 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 164 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. యూఎస్ తో పాటు ఇతర కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 541 పాయింట్లు నష్టపోయి 59,806కి పడిపోయింది. నిఫ్టీ 164 పాయింట్లు కోల్పోయి 17,589 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.55%), ఎల్ అండ్ టీ (1.08%), భారతి ఎయిర్ టెల్ (0.97%), యాక్సిస్ బ్యాంక్ (0.90%), ఎన్టీపీసీ (0.36%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.31%), రిలయన్స్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.97%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.86%), మారుతి (-1.74%).

More Telugu News