Avinash Reddy: వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి

MP Avinash Reddy files petition on Telangana High Court
  • వివేకా హత్య కేసులో అవినాశ్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ
  • రేపు మరోసారి విచారణ
  • న్యాయవాదిని అనుమతించాలంటూ అవినాశ్ పిటిషన్
  • ఆడియో, వీడియో రికార్డింగ్ కు ఆదేశించాలని విజ్ఞప్తి
  • సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వినతి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే రెండు దఫాలు విచారించింది. మరో విడత విచారణకు ఈ నెల 6న రావాలంటూ నోటీసులు పంపగా, తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అవినాశ్ రెడ్డి బదులిచ్చారు. దాంతో సీబీఐ ఈ నెల 10న రావాలంటూ మళ్లీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి రేపు హైదరాబాదులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. 

అయితే, ఈ విషయంలో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని... విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 

అంతేకాదు, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
Avinash Reddy
CBI
Telangana High Court
YS Vivekananda Reddy
YSRCP

More Telugu News