మూడేళ్లుగా ఇద్దరు అమ్మాయిలతో సహజీవనం.. ఇద్దరికీ సంతానం.. ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
- మరదలు, ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన యువకుడు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన శుభలేఖ
ఒకరికి పాప.. మరొకరికి బాబు
సత్తిబాబు మూడేళ్లుగా ఇద్దరితోనూ సహజీవనం కొనసాగిస్తున్నాడు. స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఇద్దరినీ పెళ్లాడతానని చెప్పాడు. దీంతో విషయం మూడు గ్రామాల పెద్దలకు చేరింది. వారు పంచాయితీ పెట్టారు. అమ్మాయిలు కూడా అతడిని పెళ్లాడేందుకు ఇష్టపడడంతో పెళ్లి నిశ్చయించారు. ఎర్రబోరు గ్రామంలో ఈ ఉదయం 7.04 గంటలకు ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కట్టాడు.