K Kavitha: ఢిల్లీకి బయల్దేరిన కవిత.. ఈడీ నోటీసుల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ

  • లిక్కర్ స్కామ్ లో రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కవిత
  • 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్న కవిత
  • ఢిల్లీకి వెళ్లే ముందు తండ్రికి ఫోన్ చేసిన వైనం
Kavitha leaves to Delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపింది. నోటీసుల ప్రకారం రేపు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాల కారణంగా 9న విచారణకు హాజరు కాలేనని... 15న హాజరవుతానని ఆమె ఈడీని కోరారు. 

అయితే, ఆమె విన్నపం పట్ల ఈడీ అధికారులు స్పందించలేదు. దీంతో, ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆమె తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో తన కూతురుకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఆందోళన చెందొద్దని, బీజేపీపై న్యాయపరంగా పోరాడుదామని ఆయన భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో నీవు తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించు అని చెప్పారు. మరోవైపు, రేపు ఈడీ విచారణకు కవిత హాజరవుతారా? లేదా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More Telugu News