Nara Lokesh: ఒక్కసారి మీటరు బిగిస్తే తొలగించడం అసాధ్యం: రైతులతో లోకేశ్

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర
  • రైతులతో సమావేశమైన లోకేశ్
  • తమ బాధలు లోకేశ్ తో చెప్పుకుని వాపోయిన రైతులు
  • మీటర్లను వ్యతిరేకించాలని సూచించిన టీడీపీ అగ్రనేత
Lokesh held meeting with farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 37వ రోజు (మంగళవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ప్రారంభమైంది. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగారు. టీడీపీ నేత వంగవీటి రాధ నేడు లోకేశ్ ను కలిసి సంఘీభావంగా కొంతసేపు పాదయాత్రలో పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. 

లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్

  • వక్ఫ్ ఆస్తులను వైసీపీ నాయకుల యధేచ్ఛగా దోచుకుంటున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తాం.
  •  ఇకపై వక్ఫ్ ఆస్తుల వైపు ఎవరూ చూడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా చేరుస్తాం
  • టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే దూదేకుల కులం వారికి బీసీ సర్టిఫికేట్ అందేలా చేస్తాం.
  • ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ముస్లింలకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తాం.
  • మైనారిటీల సంక్షేమం కోసం భారతదేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ను పెట్టిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుది. దాన్ని కొనసాగిస్తూ మైనారిటీలను పేదరికం నుండి దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. 

  • జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు.
  • జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మోసం చేశారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా గారు ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదు. 
  • జగన్ రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేశారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు. 
  • జగన్ పాలనలో మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అబ్దుల్ సలాంని వేధించి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మసీదు ఆస్తులు కాపాడుకోవడానికి పోరాడిన ఇబ్రహీంని నడి రోడ్డు మీద చంపేశారు. 
  • హజీరా అనే ముస్లిం యువతిని అత్యాచారం చేసి చంపేశారు. ఏళ్ళు గడుస్తున్నా ఆమె కుటుంబానికి న్యాయం జరగలేదు. పలమనేరుకి చెందిన మిస్బా అనే అమ్మాయి స్కూల్ ఫస్ట్ వస్తుంది వైసీపీ నేత వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇన్ని ఘటనలు జరిగితే మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఏమి చేశారు?

  • వైసీపీ పాలనలో 10 మంది మైనారిటీలను దారుణంగా చంపారు. 36 మందిపై అక్రమ కేసులు బనాయించారు. పుంగనూరులోనే 12 మంది మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పీలేరు జైలుకు పంపారు. శానసమండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ పట్ల వైసీపీ మంత్రులు అనుచితంగా ప్రవర్తించారు. దాడి చేశారు. బూతులు తిట్టి అవమానించారు.
  • యువగళంలో టపాసులు కాల్చినందుకు కూడా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇలా ఏదో ఒక కేసు పెట్టి మిమ్మల్ని భయపెట్టాలని జగన్ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చూస్తారు. 
  • ఎవరూ భయపడొద్దు. పీలేరులో తెలుగుదేశం జెండా ఎగరేయండి... మీ సమస్యల్ని మేం పరిష్కరిస్తాం.

  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు బిగించాలని చూస్తున్నాడు. ఒక్కసారి మీటరు బిగిస్తే తొలగించడం అసాధ్యం.
  • మీటర్లు పెట్టేందుకు రైతులెవరూ అంగీకరించొద్దు. సర్వీస్ కట్ చేస్తే మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది.
  • ఉచిత విద్యుత్ మీ హక్కు. ఇది ఒక్క రైతు సమస్య కాదు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదాం. మీటర్ల విషయంలో వైసీపీకి చెందిన రైతులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తారు. 
  • మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు కాబోతున్నాయి. రాయలసీమలో నీరు అందక ఎంతో లోతు బోరు తవ్వాల్సి ఉంటుంది. రైతుకు ఒక బోరు మాత్రమే ఉండాలని జగన్ అంటాడు. 

  • ఇప్పుడున్న వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఒక కోర్టు దొంగ. మంత్రయ్యాక రైతులను పట్టించుకున్నాడా? జగన్ వచ్చాక పవర్, క్రాప్, ఆక్వా హాలిడే వచ్చింది.
  • ఉపాధిహామీపై కేంద్రంతో మాట్లాడి వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. రైతులకు పార్టీలుండవు. 
  • నేను పాదయాత్ర దారిలో 26 రైతు భరోసా కేంద్రాలు చూశా... ఎక్కడ చూసినా తాళాలు వేసి ఉంటున్నాయి. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రం ఇచ్చే వాటితో కలిపి ఒక్కో రైతుకి రైతు భరోసా కింద 18,500 రావాలి. కానీ రూ.13,500 మాత్రమే ఇస్తున్నాడు. ఒక్కొక రైతుకు జగన్ రూ.25 వేలు బాకీ పడ్డాడు.
  • టీడీపీ వచ్చిన వంద రోజుల్లో టమాటా మార్కెట్లలో  జాక్ పాట్ విధానం రద్దు చేస్తాం.
  • జగన్ రెడ్డి అమూల్ తెచ్చారు... కానీ అది పుంగనూరులో ఉండదు. తక్కువ ధరకు పాలు కొంటున్నాడు. రూ.50 కోట్లను పాడి రైతుల నుండి దోచుకుంటున్నాడు. 
  • గతంలో గోపాలమిత్రలను ఏర్పాటు చేశాం. ఒక్క ఫోన్ కొట్టగానే వాళ్లు ఇంటికి వచ్చి సమస్య పరిష్కరించేవాళ్లు. గోపాలమిత్ర వ్యవస్థను ఈ సీఎం రద్దు చేశారు. 

యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 483.6 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం – 10.9 కి.మీ.*
*యువగళం పాదయాత్ర 38వ రోజు షెడ్యూల్ (8-3-2023)*

*పీలేరు నియోజకవర్గం*

ఉదయం

8.00 – చింతపర్తిలోని బోయపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో మహిళలతో ముఖాముఖి.
9.00 – బోయపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
11.00 – విటలం గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.00 – పునుగుపల్లిలో స్థానికులతో సమావేశం.
12.20 – పునుగుపల్లిలో భోజన విరామం.

సాయంత్రం

2.30 – పునుగుపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
3.00 – వాయల్పాడులో మైనారిటీలతో సమావేశం.
3.25 – వాయల్పాడు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
5.00 – మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశం.
6.30 – పూలవాండ్లపల్లి (మదనపల్లి రూరల్ మండలం) వద్ద విడిది కేంద్రంలో బస.

*********




More Telugu News