Saiyami Kher: డబ్ల్యూపీఎల్ పై కన్నేసిన బాలీవుడ్ భామ... వచ్చే ఏడాది సెలక్షన్ కు వెళతానని వెల్లడి

Bollywood diva Saiyami Kher eyes on WPL

  • క్రికెట్ పై ఆసక్తి చూపుతున్న సయామీ ఖేర్
  • నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్
  • భారత్ లో డబ్ల్యూపీఎల్ జరుగుతుండడం పట్ల హర్షం

సాయిధరమ్ తేజ్ మొదటి చిత్రం 'రేయ్' లో హీరోయిన్ గా నటించిన సయామీ ఖేర్ గుర్తుందా...? ఆ తర్వాత చాన్నాళ్లకు నాగార్జునతో 'వైల్డ్ డాగ్' లో నటించింది. పలు బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో తళుక్కుమంది. 

అయితే సయామీ ఖేర్ కు నటన మాత్రమే కాదు క్రికెట్ కూడా వచ్చు. ఆమె బ్యాటింగ్ స్టయిల్ చూస్తే ఏ ప్రొఫెషనల్ క్రికెటర్ కూ తీసిపోదు. ప్రస్తుతం భారత్ లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జరుగుతున్న నేపథ్యంలో, సయామీ ఖేర్ క్రికెట్ పై తనకున్న ఆసక్తిని బయటపెట్టింది. ఇప్పుడామె నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోంది. 

వచ్చే ఏడాది తప్పకుండా డబ్ల్యూపీఎల్ సెలెక్షన్ కు వెళతానని చెబుతోంది. అయితే, సినిమా షూటింగులేవీ లేకపోతేనే సెలెక్షన్ కు వెళతానని అంటోంది. స్కూల్లో చదివేటప్పుడు క్రికెట్ ఆడేదాన్ని కాదని, ఇతర క్రీడలు ఆడేదాన్నని సయామీ వెల్లడించింది. ఇప్పుడు ఓ క్రికెట్ జట్టును తయారుచేసుకుని ఆడుతున్నానని, భారత్ లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు జరుగుతుండడం ఆనందం కలిగిస్తోందని పేర్కొంది. 

క్రికెట్ ఆడడం అనేది తన చిన్ననాటి కల అని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన బ్యాటింగ్ వీడియోను కూడా పంచుకుంది

Saiyami Kher
WPL
Selection
Cricket
Bollywood
  • Loading...

More Telugu News