Dhaka: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు... 14 మంది మృతి

  • పాత ఢాకాలోని ఓ భవనంలో పేలుడు
  • 70 మందికి గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • నిల్వ ఉంచిన రసాయనాలే పేలుడుకు కారణమని అనుమానం
Huge explosion in Dhaka killed 14 people

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఏడంతస్తుల భవనంలో సంభవించిన పేలుడు ధాటికి 14 మంది మృతి చెందారు. 70 మంది గాయపడ్డారు. పాత ఢాకా గులిస్థాన్ ప్రాంతంలోని సిద్ధిక్ బజార్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

పేలుడుకు కారణం స్పష్టంగా తెలియకపోయినా, ఆ భవనంలో రసాయనాలు అక్రమంగా నిల్వచేస్తున్నారని, పేలుడుకు రసాయనాలే కారణం అయ్యుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి సిద్ధిక్ బజార్ మొత్తం ఊగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంపం సంభవించి ఉంటుందని భావించినట్టు సఫాయత్ హుస్సేన్ అనే వ్యక్తి వెల్లడించాడు.

More Telugu News