WPL: డబ్ల్యూపీఎల్: ముంబయిలో మెగ్ లానింగ్ జోరు.. మ్యాచ్ కు వరుణుడి బ్రేక్

Rain halts play between Delhi Capitals and UP Warriorz in Mumbai
  • నేడు యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • 9 ఓవర్ల వద్ద వర్షం.. నిలిచిపోయిన మ్యాచ్
  • 1 వికెట్ నష్టానికి 87 రన్స్ చేసిన ఢిల్లీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతుండగా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తుండగా... 9 ఓవర్ల వద్ద వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. 

కెప్టెన్ మెగ్ లానింగ్ కేవలం 34 బంతుల్లోనే 53 పరుగులు చేసి క్రీజులో ఉంది. ఆమె స్కోరులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఓపెనర్ గా దిగిన లానింగ్ దూకుడు కొనసాగుతున్న తరుణంలో వర్షం అంతరాయం కలిగించింది. 

మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 17 పరుగులు చేసి తహ్లియా మెక్ గ్రాత్ బౌలింగ్ లో అవుటైంది. లానింగ్ కు తోడు మరిజానే కాప్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో పిచ్ పై కప్పిన కవర్లు తొలగించారు. మ్యాచ్ 8.30 గంటలకు కొనసాగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News