Revanth Reddy: రేవంత్ రెడ్డి కోసం మిర్చి బజ్జీ తీసుకువచ్చిన 'బిగ్ బాస్' ఫేమ్ గంగవ్వ

Bigg Boss fame Gangavva brings mirchi bajji for Revanth Reddy
  • హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపట్టిన రేవంత్
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • రేవంత్ రెడ్డిని కలిసిన గంగవ్వ
  • తల్లిని గుర్తుచేసిందంటూ రేవంత్ ఎమోషనల్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కలిసింది. రేవంత్ రెడ్డి కోసం ఆమె మిర్చి బజ్జీ తీసుకురాగా, ఆయన ఎంతో ఇష్టంగా ఆరగించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"గంగవ్వ... తెలంగాణకు పరిచయం అక్కర్లేని అవ్వ. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నాకోసం ఆప్యాయంగా, నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ తీసుకువచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించేవాడిని. తల్లిని గుర్తుచేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను" అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి పంచుకున్నారు.
Revanth Reddy
Gangavva
Mirchi Bajji
Haath Se Haath Jodo
Congress

More Telugu News