Namrata: వట్టెం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మహేశ్ బాబు భార్య నమ్రత

Mahesh Babu Wife Namarata visited Venkateshwara temple
  • నాగర్ కర్నూలు జిల్లాలో కొలువైన వట్టెం వెంకటేశ్వరస్వామి
  • స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నమ్రత
  • తిరుమలకు వచ్చిన అనుభూతి కలిగిందన్న నమ్రత
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో ఉన్న వట్టెం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ దర్శించుకున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలోని గోశాలను కూడా ఆమె సందర్శించారు. మరోవైపు ఆలయానికి వచ్చిన నమ్రతకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి సంబంధించిన వివరాలు ఉన్న పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ తిరుమల ఆలయానికి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకన్న కొండపై ఈ ఆలయం ఉంది. ఇక్కడి స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకుంటుంటారు.
Namrata
Mahesh Babu
Vattem Venkateshwara Swamy
Tollywood

More Telugu News