upasana konidela: రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!

upasana konidela says this year is all about her husband ram charan
  • తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో చరణ్ మద్దతుగా నిలిచారన్న ఉపాసన
  • ఆయనకు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని వెల్లడి
  • అందుకే ఈ ఏడాది చరణ్ దేనని వ్యాఖ్య
తన భర్త, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం చరణ్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారని, అందుకే ఈ ఏడాది తన భర్తదేనని అన్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఉపాసన.. తన భర్త సాధిస్తున్న విషయాలను గురించి ప్రస్తావించారు. 

తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో రామ్ చరణ్ మద్దతుగా నిలిచారని ఉపాసన చెప్పారు. అలాగే తాను కూడా చరణ్ కు అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటానని తెలిపారు. ‘‘ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట షూటింగ్ కోసం చరణ్ ఉక్రెయిన్ కు వెళ్లినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నప్పుడు.. ఇలా ప్రతి విషయంలోనూ చెర్రీ వెన్నంటే ఉన్నాను’’ అని వివరించారు.

‘‘చరణ్ కు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వర్క్ పరంగా కూడా ఆయన ఎంతో సంత‌ృప్తిగా ఉన్నారు. ఈ సంవత్సరం ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అందుకే ఈ ఏడాది ఆయనదే’’ అని చెప్పుకొచ్చారు.

విదేశీ పర్యటనల్లో రామ్ చరణ్ తోపాటు ఉపాసన సందడి చేస్తుంటారు. ఇటీవల అమెరికా పర్యటనలో చరణ్ తో కనిపించారు. ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా.. కాలిఫోర్నియాలో జరిగిన ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్, ఆస్కార్ అవార్డుల వేడుకల కోసం రామ్ చరణ్ తో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా ప్రస్తుతం అమెరికాలోనే ఉంది.
upasana konidela
Ramcharan
RRR
oscar

More Telugu News