Laya: నా సినిమాల్లో మా వారికి నచ్చింది ఇదే: లయ

Laya Interview
  • 60 సినిమాలలో నటించిన లయ 
  • తాజా ఇంటర్వ్యూలో తన భర్తను గురించిన ప్రస్తావన
  • తన సినిమాల్లో ఆయనకి 'మిస్సమ్మ ' ఇష్టమన్న లయ 
  • తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని వెల్లడి
సౌందర్య తరువాత నటన ప్రధానమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందిన కథానాయికగా 'లయ' కనిపిస్తారు. తెలుగులో 40 సినిమాల వరకూ చేసిన లయ, ఇతర భాషల్లో ఓ 20 సినిమాల వరకూ చేశారు. వివాహం తరువాత అమెరికాలోనే ఉంటున్న లయ, రెండు వారాల క్రితమే అక్కడి నుంచి వచ్చారు. 

తాజాగా 'ఐ డ్రీమ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ .. "నేను ఇంతవరకూ చేసిన పాత్రల విషయంలో సంతృప్తితో ఉన్నాను. వివాహమైన తరువాత నుంచి నేను నటించలేదు. నాకు ఇప్పుడు ఇద్దరు  పిల్లలు .. మా అమ్మాయికి ఏజ్ 14 .. అబ్బాయికి 12 ఏళ్లు. ఇకపై మాత్రం నాకు నచ్చిన పాత్ర దొరికితే ఇక్కడికి వచ్చి చేసి వెళ్లాలని అనుకుంటున్నాను" అని అన్నారు. 

"మా వారిలో నాకు బాగా నచ్చేది ఆయన సహనం. నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. నేను ఒకటి అడిగితే ఆయన పది కొనుక్కుని వస్తారు. నేను చేసిన సినిమాల్లో ఆయనకి 'మిస్సమ్మ' అంటే ఇష్టం. నాకు పులిహోర .. మా అమ్మపెట్టే రసం అంటే చాలా ఇష్టం. అలాగే నా డబ్బులతో నేను 'చీర' కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను" అంటూ చెప్పుకొచ్చారు.

Laya
Actress
Tollywood

More Telugu News