healthy: ఈ ఆహారంతో దీర్ఘకాల వ్యాధులు ఆమడ దూరం!

  • తీసుకునే ఆహారంలో అవసరమైన పోషకాలు ఉండాలి
  • వంట నూనెలు అన్నీ కాకుండా ఆలీవ్, కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు
  • ఫాస్ట్ ఫుడ్స్ వద్దు.. వేపుళ్లూ ప్రమాదకరమే
healthy cooking techniques to keep chronic diseases at bay

ఆరోగ్యం విషయంలో ఆహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మంచి ఆహారంతోపాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఆహారం నుంచి మనకు కావాల్సిన పోషకాలు రావాలంటే అవసరమైన వాటికి తప్పక చోటివ్వాలి. రుచితోపాటు పోషకాలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యం విషయంలో త్యాగంతో పనిలేదు. 

మంచి కొవ్వులు
వంట నూనెలు అన్నీ ఒకటి కావు. ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు ఉండే నూనెలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆలీవ్ ఆయిల్, అవకాడో ఆయిల్, కోకోనట్ ఆయిల్ వాడుకోవాలి. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. ఈ నూనెలతో శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ఉండదు. దానివల్ల దీర్ఘకాల వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరం
ప్రాసెస్డ్ ఫుడ్స్ లో అనారోగ్యం తెచ్చే కొవ్వులు ఎక్కువ. ప్రిజర్వేటివ్ లను ఉపయోగిస్తారు. చక్కెర కూడా కలుపుతారు. వీటికి బదులు తాజా ఆహారం, ముడి ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్లాంట్ ఆధారిత ఉత్పత్తులు
మొక్కల నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాల వినియోగంతో దీర్ఘకాల వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. వేర్వేరు రకాలను వినియోగించడం వల్ల పోషకాలు అన్నీ అందుతాయి. 

మూలికలు, సుగంధ దినుసులు
మూలికలు, సుగంధ దినుసులను నచ్చిన ఆహారానికి కలుపుకోవచ్చు. ఆహారానికి మంచి ఫ్లావర్ కూడా వస్తుంది. ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

ఉప్పు వినియోగం
అధిక ఉప్పు వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. వంటల్లో చాలా పరిమితంగానే ఉప్పు వేసుకోవాలి.

వేపుళ్లు
వేయించిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే మంచిది. వేపుళ్ల వల్ల అందులోని ఫ్యాట్స్, క్యాలరీలు దీర్ఘకాల వ్యాధుల రిస్క్ ను పెంచుతాయి.

బెవరేజెస్
చక్కెర కలిసిన పానీయాలు తీసుకోవద్దు. అలాగే గ్యాస్ తో నింపిన సోడాలు, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు తాగకూడదు. వీటికి బదులు పంచదార వేయని, టీ, కాఫీ తాగడం మేలు.

More Telugu News