Bill Gates: తాత అయిన బిల్ గేట్స్.. మగబిడ్డకు జన్మనిచ్చిన జెన్నిఫర్

Bill Gates daughter Jennifer gives birth to baby boy
  • ప్రేమ వివాహం చేసుకున్న జెన్నిఫర్ కేథరిన్ గేట్స్
  • కేథరిన్ భర్త నాజర్ కు ఈజిప్టు పౌరసత్వం
  • కూతురు, అల్లుడికి శుభాకాంక్షలు తెలిపిన బిల్ గేట్స్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తాత అయ్యారు. ఆయన కూతురు జెన్నిఫర్ కేథరిన్ గేట్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జెన్నిఫర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడి పాదాల ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెన్నిఫర్ కు శుభాకాంక్షలు చెపుతూ ఎంతో మంది పోస్టులు పెట్టారు. బిల్ గేట్స్ కూడా తన కూతురు, అల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు. 

జెన్నిఫర్, నయెల్ నాజర్ 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమించుకున్న వీరి ప్రేమకు బిల్ గేట్స్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2021 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. నాజర్ కు ఈజిప్టు పౌరసత్వం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఈజిప్ట్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. నాజర్ షికాగోలో జన్మించారు. నాజర్ క్రీడాకారుడు కూడా. 2020 ఒలింపిక్స్ లో ఆయన ఈజిప్ట్ తరపును హార్స్ రేస్ పోటీల్లో పాల్గొన్నారు. 
Bill Gates
Daughter
Child

More Telugu News