Junior NTR: ఆస్కార్ కోసం అమెరికాకు బయల్దేరిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR leaves to USA for Oocars
  • ఈ నెల 12న ఆస్కార్ అవార్డుల వేడుక
  • ఇప్పటికే అమెరికాలో ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్
  • ఈ ఉదయం యూఎస్ కు బయల్దేరిన తారక్
ఈ నెల 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' టీమ్ అమెరికాకు వెళ్లింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికాకు బయల్దేరాడు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో తారక్ కారు నుంచి కిందకు దిగి లోపలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న 'నాటునాటు' పాట... ఆస్కార్ అవార్డు కోసం మరో 4 ప్రముఖ ట్రాక్ లతో పోటీ పడుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా... తారకరత్న మరణంతో వాయిదా పడింది.
Junior NTR
Oscars
Tollywood
Bollywood
USA

More Telugu News