పరుగులో భారతీయుడి రికార్డ్.. 350 కిలోమీటర్లు
- 102 గంటల 27 నిమిషాల్లో లక్ష్యం చేరిక
- డెలీరియస్ వెస్ట్ మారథాన్ విజేత సుకాంత్ సుఖి
- పోటీలో భాగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానన్న విజేత
మారథాన్ లో భాగంగా ఎదుర్కొన్న కష్టాల, సవాళ్ల గురించి తెలియజేస్తూ సుకాంత్ సుఖి యూట్యూబ్ లో ఓ వీడియో ఉంచాడు. మారథాన్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ‘‘నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైనది ఇదే. మిగిలిన జీవిత కాలం మొత్తం ఇది గుర్తుండిపోతుంది. ప్రమాదకరమైన అడవిలో 350 కిలోమీటర్లు పరుగు తీయడం సాధ్యమేనా? అంటూ’’ ప్రశ్నించాడు.