Sharmila: కవిత నిరాహారదీక్షపై షర్మిల సెటైర్లు

  • మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిరాహారదీక్షకు దిగనున్న కవిత
  • తెలంగాణలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదన్న షర్మిల
  • లిక్కర్ స్కామ్ తో మహిళలకు తలవంపులు తెచ్చారని విమర్శ
Sharmila satires on Kavitha hunger strike

మహిళా రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10న నిరాహారదీక్షకు దిగనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కవిత దీక్షపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, కవితకు మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. కవిత నిరాహారదీక్ష చేస్తానని చెప్పడం బంగారం పోయిందంటూ దొంగలే ధర్నా చేసినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిజాలు బయటపడతాయని కవిత భయపడుతున్నారని... అందుకే ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టించేందుకు మహిళా రిజర్వేషన్లు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. 

రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. 2018 ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి కేవలం ఇద్దరు మహిళలను మాత్రమే తీసుకున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవిత మహిళలకు తలవంపులు తెచ్చారని అన్నారు.

More Telugu News