Komatireddy Raj Gopal Reddy: రేపో, మాపో కవిత అరెస్ట్ కావడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Kavitha will be arrested soon says Komatiredy
  • తాను అమ్ముడుపోయానంటూ కేసీఆర్, రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కోమటిరెడ్డి
  • అవినీతి చేసి ఉంటే నిరూపించాలని సవాల్
  • కేసీఆర్ వ్యతిరేకత మునుగోడు ఎన్నికల్లో బయటపడిందని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపో, మాపో అరెస్ట్ కావడం ఖాయమని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మునుగోడు ఉపఎన్నికలో బయటపడిందని చెప్పారు. ప్రజా వ్యతిరేకత నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. ఉప ఎన్నిక సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేశారని... అయినా ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. 

తనను రాజకీయంగా ఎదుర్కోలేక తాను అమ్ముడుపోయానంటూ కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. వేంకటేశ్వస్వామి సాక్షిగా చెపుతున్నా తాను ఎవరికీ అమ్ముడుపోలేదని అన్నారు. తనను కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అని చెప్పారు. తాను అవినీతి చేసి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలన పోయి బీజేపీ పాలన వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీఆర్ఎస్ కు బొందపెట్టేంత వరకు నిద్రపోనని చెప్పారు.

Komatireddy Raj Gopal Reddy
Congress
K Kavitha
KCR
BRS
Revanth Reddy
BJP

More Telugu News