Gold: పాకిస్థాన్ లో భగ్గుమంటున్న బంగారం ధర

  • పాక్ లో నింగిని తాకుతున్న ద్రవ్యోల్బణం
  • తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్
  • 10 గ్రాముల బంగారం ధర రూ.2.06 లక్షలు
  • వడ్డీ రేట్లు పెంచిన పాక్ రిజర్వ్ బ్యాంకు
Gold price raised in Pakistan

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న పాకిస్థాన్ లో ఏ వస్తువు ధర చూసినా మండిపోతోంది. నింగిని అంటుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ప్రభుత్వ నిస్సహాయత మరోవైపు పాకిస్థాన్ ను దివాలా దిశగా నడిపిస్తున్నాయి! 

మరోపక్క, ఇప్పుడక్కడ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2.06 లక్షలు (పాకిస్థాన్ కరెన్సీలో) అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా డాలర్ తో పోల్చితే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం డాలర్ తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది. 

పాకిస్థాన్ నెలవారీ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసంలో 31.6 శాతం పెరిగిపోగా.... పాకిస్థాన్ రిజర్వ్ బ్యాంకు 300 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచేసింది. 

దేశం దివాలా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో పన్నులు బాగా పెంచేయగా, ధరలు కూడా ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి. మరోవైపు విదేశీ మారకద్రవ్యం తగినంతగా లేకపోవడంతో విదేశీ దిగుమతులు అంతంతమాత్రంగా ఉన్నాయి.

More Telugu News