Madhu Yadav: హెలికాప్టర్ లో వెళ్లి పెళ్లికార్డులు పంచిన హైదరాబాద్ వ్యాపారవేత్త

Hyderabad businessman uses helicopter to distribute wedding cards
  • తమ్ముడిపై ప్రేమను ఘనంగా చాటుకున్న మధు యాదవ్
  • మధు యాదవ్ సోదరుడి పెళ్లికి ముహూర్తం 
  • ముంబయిలో బంధువులకు కార్డులు ఇచ్చేందుకు హెలికాప్టర్ లో పయనం
హైదరాబాద్ బిజినెస్ మేన్ మధు యాదవ్ తన సోదరుడి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు హెలికాప్టర్ లో వెళ్లి మీడియా దృష్టిని ఆకర్షించారు. త్వరలో మధు యాదవ్ తమ్ముడి వివాహం జరగనుంది. మధు యాదవ్ కుటుంబానికి ముంబయిలో బంధువులు ఉన్నారు. అక్కడే కొందరు మిత్రులు కూడా ఉన్నారు. 

దాంతో వారికి శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు. అక్కడ బంధుమిత్రులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించారు. ఈ విధంగా తన తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలను మధు యాదవ్ ఘనంగా చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Madhu Yadav
Wedding Cards
Helicopter
Hyderabad
Mumbai

More Telugu News