Chandrababu: తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు

Chandrababu attends Tarakaratna eleventh day ceremony
  • ఇటీవల తారకరత్న కన్నుమూత
  • నేడు హైదరాబాదులో దశ దిన కార్యక్రమం
  • హాజరైన నందమూరి, నారా కుటుంబ సభ్యులు
  • తారకరత్న చిత్ర పటానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా, తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించారు. 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న దశ దిన కార్యక్రమానికి హాజరు కాగా.... చంద్రబాబు ఆయనతో కరచాలనం చేసి క్లుప్తంగా మాట్లాడారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News