విజయ్ దేవరకొండ జోడీగా అందాల బాల .. శ్రీలీల!

  • 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల
  • డాన్సులతోను మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ  
  • బాలయ్య .. పవన్ సినిమాల్లో అవకాశాలు 
  • యంగ్ హీరోలతోను వరుస ప్రాజెక్టులు
Sreeleela Movies Update

టాలీవుడ్ లో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ గా శ్రీలీల కనిపిస్తోంది. ఏ హీరోతో .. ఏ సెట్లో చూసినా, ఆ షూటింగులో ఆమెనే కనిపిస్తోంది. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందని అంతా చెప్పుకుంటున్నారు. 'ధమాకా' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఆమె జోరు మరింతగా పెరిగిపోయింది.

ఇప్పటికే ఆమె మహేశ్ బాబు ..  రామ్ .. నితిన్ .. వైష్ణవ్ తేజ్ .. నవీన్ పోలిశెట్టి సరసన కథానాయికగా నటిస్తోంది. బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో, బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించనుంది. ఇక సముద్రఖనితో పవన్ చేస్తున్న సినిమాలోని స్పెషల్ సాంగ్ లోను ఆమెనే సందడి చేయనుంది.  

గ్లామర్ పరంగా .. నటన పరంగా .. డాన్సుల పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న ఈ సుందరి, విజయ్ దేవరకొండ జోడీగా కూడా ఛాన్స్ కొట్టేసిందనేది తాజా సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయనున్నాడు. సితార బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. 'ఖుషి' తరువాత విజయ్ దేవరకొండ చేయనున్న సినిమా ఇదే. ఇందులో కథానాయికగా శ్రీలీలకి అవకాశం దక్కింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

More Telugu News